Sunday, March 29, 2026

రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం

  • బిజెపి మున్సిపల్ ఇన్చార్జి ఆరే రవీందర్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ( కోక్కుల వంశీ ) : టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండింటిలో భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు గెలుపొందిన సందర్భంలో భీంగల్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంచార్జ్ ఆరే రవీందర్ మాట్లాడుతూ… రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి మల్లికార్జున్ రెడ్డికి మరియు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి, ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయానికి భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి ఎన్నో కుట్రలు కుతంత్రాలను చేసిన అధికార పార్టీ నీ కాదని భారతీయ జనతా పార్టీ పైన నమ్మకమును ఉంచి పూర్తి విశ్వాసంతో ఓట్లు వేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరము సమిష్టిగా కృషి చేసి ఐకమత్యంతో ఎన్నికలను ఎదుర్కొని అధిక స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తూ రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యోగేశ్వర నరసయ్య, బీజేవైఎం అధ్యక్షులు కొట్టాల అశోక్, సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ గౌడ్, నాగార్జున్ రెడ్డి,సంధ్య రాజు, పీరి గంగాధర్, ఉప్పల నవీన్, దయ్య ప్రవీణ్, బెజ్జోరా మహేందర్,జై గురు ప్రసాద్, బండారి నరేందర్ గౌడ్, నామాల వెంకటేష్, కాపు కుమ్మరి హరీష్, శ్రీనివాస్, డాక్టర్ నవీన్,బాబాపూర్ హకీం భాయ్,ఈశ్వర్ సాయి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News