Sunday, March 29, 2026

నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి సస్పెన్షన్

  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల (కోక్కుల వంశీ ) : నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గోల్లపల్లి పి.వి.సి కార్యాలయంలో వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిగా పనిచేస్తున్న జె. కొమురయ్య జనవరి 19, 2024 న మెడికల్ ఇన్ వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకొని కరీంనగర్లోని సన్ షైన్ హాస్పిటల్స్ జారీచేసిన సర్టిఫికెట్లను సమర్పించడం జరిగింది. అనంతరం విచారణలో జె. కొమురయ్య సమర్పించిన సన్ షైన్ హాస్పిటల్స్ వైద్య సర్టిఫికెట్లు ఫేక్ అని తేలడం జరిగింది, 2017 నుంచి సదరు వైద్యుడు ఆసుపత్రిలో పనిచేయడం లేదని, లెటర్ హెడ్, స్టాంప్స్ మొత్తం నకిలి అని, సంతకాలు కూడా వైద్యులు చేయలేదని విచారణలో తేలడం జరిగింది. నకిలీ వైద్య పత్రాలు సృష్టించినందుకు సంబంధిత వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి పై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించినందుకు గాను అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News