- ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ): భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు పేలుస్తూ ,స్విట్ల పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ… ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్, ,నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి మల్కా కొమురయ్యను ,అలాగే పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గా చిన్నమైలు అంజిరెడ్డిని గెలిపించిన మేధావులకు ఉపాధ్యాయులకు పట్టభద్రులకి పేరుపేరునా పాదభివందనం తెలిపారు. ఈ రెండు విజయాల ద్వారా బిజెపి తన బలాన్ని,ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటింది, ఈ గెలుపు అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలది అని,రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 420 మోసపూరిత హామీలు అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఉపాధ్యాయుల సమస్యలని నిరుద్యోగ సమస్యలను విద్యార్థుల సమస్యలని పట్టించుకోకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీ కి ఈ రెండు ఫలితాల ద్వారా కనువిప్పు కలిగి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని,నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని,ఉపాధ్యాయుల సమస్యలని పరిష్కరించాలని కోరుతున్నాం,లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, ఈ విజయం ద్వారా ప్రజలు బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బిజెపి హవా కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బోయిని రాజు,మీసాల రవీందర్,పెద్ది శ్రవణ్,అల్లూరి రవీందర్ రెడ్డి, తుం గంగాధర్,పడాల నరేష్, మ్యాకల పనిందర్,అరిపెల్లి తరుణ్,పవన్,పత్తిపాక వంశి తదితరులు పాల్గొన్నారు.



