- నోటి పరిశుభ్రత పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
- నోటి సమస్యలను నిర్లక్ష్యం చెయొద్దు
- జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా 2 కే వాకథన్ ను ప్రారంభించిన ఎంపీ డా..కడియం కావ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన 2 కే వాకథాన్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హన్మకొండ కలెక్టరేట్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన వాక్ లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చుఅనారోగ్యాల ముప్పును కూడా తగ్గించ వచ్చని తెలిపారు. నోటి పరిశుభ్రత పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నోటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. దంత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డెంటల్ వైద్యులను ఎంపీ అభినందించారు. గ్రామీణ స్థాయిలో దంత సమస్యలపై అవగాహన కార్య క్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐ డి ఎ మాజీ అధ్యక్షులు డా.జయసింహ రెడ్డి, వరంగల్ ఐ డి ఎ సెక్రెటరీ వేణుయాదవ్, మరియు డా. రామ్ ప్రసాద్ రెడ్డి, డా. కార్తిక్, డా. నరేష్ ఇతర డేంటల్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



