Monday, March 30, 2026

ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

నేటి సాక్షి కరీంనగర్ : మల్లారెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాగంపేట చంద్రశేఖర రావు గారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో పురోగతిని సాధిస్తున్నారని మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ సమాజం సుభిక్షంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి మొదలుపెట్టి మహిళలకు గౌరవం ఇవ్వాలని సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయినిలు నాంచారి విమల, వతీజ పుష్పలత, కొత్తపేట పద్మావతి లను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాచర్ల సంపత్, అయిలేని కరుణాకర్ రెడ్డి,తిరుకచ్చి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News