Sunday, March 29, 2026

పారిశుధ్య కార్మికుల శ్రమ అద్వితీయం

  • తిరుపతి ఖ్యాతి వెనుక వారిదే కీలక పాత్ర
  • మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ వ్యాఖ్య
  • ఆరేళ్లుగా ర్యాంకుల సాధన కార్మికుల శ్రమ ఫలితమే
  • మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బి. తులసేంద్ర
  • నగరంలో సపాయి మిత్రల విగ్రహ ఏర్పాటు సంతోషదాయకం
  • ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ
  • పండుగ వాతావరణంలో విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం
  • మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన పారిశుధ్య కార్మికులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. తిరుపతి నగరాన్ని చూస్తే ఆ మాట గుర్తొస్తుంది. ఆధ్మాత్మిక నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం ఎందరో పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రోడ్లన్నీ అద్దంలా.. కాలువలన్నీ శుభ్రంగా.. వీధులన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో శ్రామికుల కష్టం అద్వితీయం. పనే పరమావధిగా భావిస్తూ రోడ్లపై పేరుకుపోతున్న చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ నగర ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారు. స్వచ్ఛతలో దేశంలో తిరుపతికి ర్యాంకుల సాధనలో కార్మికులే సైనికులై కీర్తిని తెచ్చిపెడుతున్నారనడంలో సందేహం అవసరం లేదు.

  • పండుగలా సపాయి మిత్రల విగ్రహ ఆవిష్కరణ

తిరుపతినూ ఆధ్యాత్మికంగాన, సంస్కృతి, సాంప్రదాయాలు భావితరానికి తెలజెప్పేలా నగరపాలక సంస్థ అధికారులు పలు గోడలకు చిత్రాలు, ప్రధాన కూడల్లో విగ్రహాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగా బస్టాండు వద్దనున్న పూర్ణకుంభం సర్కిల్లో సపాయి మిత్రల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. శుక్రవారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మున్సిపల్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ హాజరైయ్యారు. ముందుగా పారిశుద్ధ కార్మికులు కష్టనష్టాలతో కూడిన పాటలు, తిరుపతి నగరానికి వారు చేస్తున్న సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, నాగరాజు, గుర్రప్ప, సూరి తదితరులు ఆలపించిన గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువఅన్వేష్ సపాయి మిత్రల విగ్రహ ఆవిష్కరణ చేపట్టిన అనంతరం పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి ఖ్యాతిని, పవిత్రతను కాపాడడంలో కార్మికులు సైనికుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మొదటి ర్యాంకు సాధించడం వెనుక పారిశుధ్య కార్మికుల పాత్రే కీలకమని తెలిపారు. కార్మికులను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కార్మికులు తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తమ వంతు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సపాయి మిత్రల విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బి. తులసేంద్ర మాట్లాడుతూ గత ఆరేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంకులు సాధిస్తూ.. నగర ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ అహర్నిశలూ కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల విగ్రహ ఆవిష్కరణ చేయడం సంతోషించాల్సిన విషయం అన్నారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించిన కమిషనర్ మౌర్యకు అభినందనలు తెలిపారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి సౌకర్యాలు కల్పిస్తున్న కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రధాకృష్ణ మాట్లాడుతూ రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో సపాయి మిత్రల విగ్రహ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అందుకు కృషి చేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బి. తులసేంద్ర, సహకరించి కమిషనర్ మౌర్యకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రాజా సంఘాల నాయకులు చిన్నం పెంచలయ్య, జే.రామచంద్రయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, నాయకులు ఎన్ డి రవి, శివ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యాక్షులు దొరస్వామి, ప్రదీప్, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్, ఉప జనరల్ సెక్రెటరీ ఉమాపతి, సెక్రెటరీలు వంశీ, డిల్లిబాబు, వెంకటరమణ, హరి, గుర్రప్ప, ఇందుమతి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News