- అదుపులో ఇద్దరు నిందితులు
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్) : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ శివారులో గల పల్లె ప్రకృతి వనం వద్ద శుక్రవారం గంజాయి పట్టుకున్నట్లు బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన సిబ్బందితో జరిపిన తనిఖీలో ఒక మోటార్ సైకిల్ మీద 50గ్రాముల గంజాయి తీసుకొని వస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని ఆయన కోరారు. గంజాయి కలిగి ఉన్నా, విక్రయించినా, సరఫరా చేసినా, వారికి సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.



