- మానసిక శారీరక దృడత్వానికి క్రీడలు ఎంతో అవసరం
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్



నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ వనపర్తి వారి ఆధ్వర్యంలో స్వర్గీయ క్రీస్తు శేషులు శ్రీమతి నారమ్మ నర్సిరెడ్డి మరియు బాదం పాండురంగయ్య స్మారక పురుషుల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు మా సిల్వర్ జూబ్లీ క్లబ్ సభ్యుల నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముందుగా క్రీడల్లో ఉత్సహంగా పాల్గోన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వహకులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. క్రీడలలో పాల్గొనడం ఎంతో స్ఫూర్తి దాయకమని ప్రతి ఒక్కరు క్రీడలను ఆడుతూ మనసిక, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మీరు ఈ క్రీడల ద్వారా మీ శారీరక దారుడ్యం మెరుగుపడటంతో పాటు, పనిఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా వుంటారని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణ, సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు, ఎం.సత్యశీలా రెడ్డి, సెక్రటరీ ఎన్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, దామోదర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ,ఏ రమేష్, ట్రెజరర్, బి నరసింహ, గేమ్ సెక్రెటరీ, ఎస్ మోహన్ రెడ్డి, ఎంసీ నెంబర్లు, తిమ్మారెడ్డి, రవీందర్, ఎం శ్రీనివాసులు, మరియు సిల్వర్ జూబ్లీ క్లబ్ సభ్యులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.



