Monday, March 30, 2026

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని డిసిపి ఏ భాస్కర్ ఐపిఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇతర పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి తగు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్ష ప్రశ్న పత్రాలు తీసుకొని వచ్చేటప్పుడు, ఆన్సర్ పేపర్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ గా ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల పరిసరాలను సైతం గమనిస్తూ ఉండాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోద్ రావు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News