Monday, March 30, 2026

గ్రామపంచాయతీ వర్కర్లకు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి

  • ఎంపీడీవోకి వినతిపత్రం అందజేసిన వర్కర్స్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గ గ్రామపంచాయతీ వర్కర్లకు 4 నెలల పాత జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ అనుబంధం రిజిస్ట్రేషన్ నంబర్ 106 జోగులాంబ గద్వాల మండల కేంద్రంలో శుక్రవారం తేదీ 7-3 – 2025 రోజున గద్వాల మండల కేంద్రంలో జరిగిన మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఈ ధర్నాలో లో టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శిలు సి హనుమంతు, ఎం కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ కు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం కొన్ని గ్రామాలలో చెక్కులు కొట్టినప్పటికీ ఈ కుబేర్లో పెండింగ్ చూపడం వలన కార్మికులకు వేతనాలు పడక గందరగోళం పడుతున్నారు రాష్ట్రంలో పంచాయతీ వర్కర్లకు కొత్త సంవత్సరం నుంచి నెలకు 5వ తారీఖు లోపు వేతనాలను చెల్లిస్తానని చెప్పిన ప్రభుత్వ హామీని గాలికి వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే మండలంలో అన్ని గ్రామాల వర్కర్లకు మూడు నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గ్రామపంచాయతీ వర్కర్స్ జీవో నెంబర్ 51 రద్దు చేస్తూ జీవో నెంబర్ 60 ని అమలు చేయాలని జీవో 60 ప్రకారం వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్మికులు రాష్ట్రంలో జిల్లాల్లో మండల కేంద్రంలో గ్రామాల్లో ఉన్న పంచాయతీ వర్కర్లు ఐకమత్యంతో ప్రభుత్వాలను నిలదీస్తూ సమస్యల పరిష్కారం కోసం చైతన్యం కావాల్సిన అవసరము ఉందని సూచించడం జరిగింది. అనంతరం ఎంపీడీవో ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ సలీం సార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రాములు కృష్ణ ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగన్న మండల నాయకులు మైబు పద్మమ్మ సరోజమ్మ శ్రీనివాసులు కురుమన్న కిష్టన్న బొజ్జన్న రవి మొదలగు వారు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News