నేటి సాక్షి కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోగల గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు ముగ్గు పోయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శాసన శాసన సభ్యురాలుపద్మావతి రెడ్డి అధ్యక్షతన కోదాడ గుడిబండ గ్రామంలో హర్వులైన వారికి సొంత ఇల్లు నియానంకై ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్టు కింద ముగ్గిపోయడం ఆనందంగా ఉందన్నారు. గత బి ఆర్ యస్ పది సంవత్సరాల పాలనలో ప్రజలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇవ్వలేక పోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి హర్వునికి ఇల్లు కట్టించి ఇచ్చే క్రమంలో కృషి చేస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్డిఓ సుర్యానారాయణ, హౌసింగ్ ఏఈ ,ఎంపీడీవో తాహాసిల్దార్ ఎంపీఓ, గుడిబండ కార్యదర్శి, గుడిబండ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ మాజీ సర్పంచ్ కురుగుంట్ల శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ ఎరగని లక్ష్మయ్య కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి రామ కృష్ణ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



