Monday, March 30, 2026

అంబేద్కర్ని అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

  • దళిత సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జలతో నిరసన

నేటిసాక్షి (కె. గంగాధర్ )పెగడపల్లి : పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలం నగునూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రపంచ మేధావి,నవ భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమాన పర్చటం జరిగింది దానికి నిరసనగా మండలంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలుపుతూ నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి లక్ష్మీ రాజం, DHPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ mrps జిల్లా నాయకులు దీకొండ మహేందర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు బాలే అంజయ్య, mrps మండల ఇంచార్జీ కొత్తూరి బాబు,మోదుంపెల్లి అంజయ్య,శనిగరాపు ప్రవీణ్,బోమ్మేన ఆటో స్వామి,బొమ్మేన వినోద్, తడగొండ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News