నేటి సాక్షి,వేమనపల్లి : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు,మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే గ్రామపంచాయతీలో పన్నుల వసులు పెరగాలన్నారు.తాగునీటి సరఫరా,చలి వేంద్రాల ఏర్పాటు పారిశుధ్య పనులు నిర్వహించాలనీ ఆదేశించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డిఈ ఆర్డబ్ల్యూఎస్ రత్న ప్రవీణ్ కుమార్,ఏఈ ఆర్డబ్ల్యూఎస్ సాయికృష్ణ పాల్గొన్నారు.



