నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ రెడ్డి (దాము) జయంతి పురస్కరించుకొని వారి స్వహగృహంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యే ఉండగా ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యము కల్పించారని అన్నారు.బాదనకుర్తి బ్రిడ్జి వారి కృషితో మంజూరు అయిందని అన్నారు. నియోజకవర్గానికి మంచి పేరుతో పాటు అభివృద్ధి కూడా కృషి చేశారని ఆయనను నియోజకవర్గ ప్రజలు మరువలేరని ఆయన లేని లోటు మరువలేదని అంటూ ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, గుంటుక సదాశివ్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇల్లెందుల కృష్ణమాచారి,గడ్డం రాజిరెడ్డి, అంబల్ల జగన్,ఆర్కే గణేష్,కొండేపు శ్రీనివాస్, కలాల రాజిరెడ్డి,సుతారి లింగారెడ్డి, తోకల సత్యనారాయణ, వేముల రవీందర్, శ్రీకర్ గౌడ్, గుంటుక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



