Monday, March 30, 2026

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్మికుల ఒక్కరోజు ధర్నా

  • రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాలో పాల్గొన్న అనంతగిరి మండల కార్మికులు
  • సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవో సుష్మాకు అందజేత

నేటి సాక్షి, కోదాడ(అనంతగిరి) : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం గ్రామ పంచాయితీ సిబ్బందికి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, వేతనాల చెల్లింపుకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా అనంతగిరి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ఒకరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం ఎంపీడీవో సుష్మాకు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ… అనంతగిరి మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో వివిధ రకాల పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు సేవలందిస్తున్న పంచాయితీ కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేయడంతో పంచాయితీ కార్మికుల కుటుంబాలలో ఈ ప్రకటన ఆనందోత్సాహాన్ని నింపింది. కాని ప్రభుత్వం 2025 జనవరి 1 నుండి కార్మికుల వేతనాలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం కార్మికుల వేతనాలు చెల్లించలేదు. 2 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో కార్మికులు నిరాశకు గురౌతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పంచాయితీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా కార్మికుల వేతనాలకు బడ్జెట్ కేటాయించేందుకు ఒత్తిడి తీసుకురావాలని, ఎస్ టి ఓ లలో నిలిచిపోయిన వేతనాల బిల్లులను రిలీజ్ చేయించాలని, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా ఒక్కపూట పనికి ఉత్తర్వులు ఇచ్చే విధంగా తమరి ద్వారా ప్రభుత్వానికి, అధికారులకుl తెలియజేయాలని ఎంపీడీవోను వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మండల అధ్యక్షులు డేగ హనుమంతు, డివిజన్ నాయకులు గుండు సురేష్, కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News