- నివాళులు అర్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన
- పాడె మోసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈశ్వర్రెడ్డి శుక్రవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గ్రామానికి చేరుకుని పూలమాల వేసి నివాళలు అర్పించారు. అనంతరం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈశ్వర్రెడ్డి అంత్యక్రియలు జరిగేంత వరకు అక్కడే వున్న చెవిరెడ్డి స్మశాన వాటిక వరకు పాడె మోశారు. ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈశ్వర్రెడ్డి మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రజలకు తీరని లోటన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవ చేసే ఈశ్వర్రెడ్డి మరణించారని తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రాఘవరెడ్డి పౌల్ట్రీ ఫామ్స్ అధినేతగా పరిచయమైన ఈశ్వర్రెడ్డి మృతికి కోళ్లపరిశ్రమకు చెందిన వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రాపురం మండలం నుంచి పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.



