నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్) : భారత రాజ్యాంగ నిర్మిత విశ్వ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క విజయకుమార్ పోలీసు ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం రోజున సారంగాపూర్ మండలం నగునూరు గ్రామంలో గ్రామంలో కొందరు దుండగులు అంబేద్కర్ విగ్రహా విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన సందర్భంగా దళిత బహుజన,సంఘాల నాయకులు, మేధావి వర్గం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జరిగిన సంఘటన గూర్చి గ్రామస్తులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకులను అవమానించడం సమాజంలో పరిపాటిగా మారిందని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానాలు జరగడం నిత్య కృత్యమైందని, బాధ్యులను కఠినంగా శిక్షించడం వల్లనే సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాలను అవమానిస్తూ ధ్వంసం చేస్తూ దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న దుండగులకు దేశద్రోహు లాంటి కఠిన శిక్షలు విధించాలని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. దుండగులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్న వారైనా పట్టుకొని శిక్షించేంతవరకు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలానికి తరలి వెళ్లి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తాసిల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జమీరుద్దీన్ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బిరుదుల లక్ష్మణ్, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్, న్యాయవాదులు నకుమల్ల లక్ష్మీనారాయణ, బొల్లె రాజన్న, గుడి కందుల మహేష్, గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగాధర్ నాయకులు బొల్లె గంగారం బోల్లం విజయ్ కుమార్, దళిత బహుజన సంఘాల నాయకులు నాగునూరు అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గంగాధర్ మరియు తిరుపతి సంఘ సభ్యులు సైదల విజయ్ బొల్లి గంగారం మాజీ సర్పంచ్ మోరపల్లి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



