Monday, March 30, 2026

ధాన్యం దొంగతనం చేసే ఇద్దరు దొంగల అరెస్టు

  • నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఆరుబయట ధాన్యం పోస్తున్నారా..రైతులు జాగ్రత్త…
  • ఎస్సై శ్యాం పటేల్

నేటి సాక్షి, వేమనపల్లి : నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడ్డుగూడెం శివారులో వ్యవసాయ క్షేత్రంలో నిల్వ ఉంచిన మక్కలను(మొక్క జొన్న) దొంగతనం చేసిన కేసులో జైపూర్ మండలంలోని ఇందారంకు చెందిన రేగుంట వంశీ, మంతెన శ్యామలను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్యాం పటేల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మంగేనపల్లి గ్రామానికి చెందిన అత్రం వెంకటస్వామి ఒడ్డూగుడెం శివారులో కౌలుకు చేస్తున్న పంట పొలాలలో ఆరబెట్టి ఉన్న మక్కలను ఎత్తుకెళ్ళుతున్నారని గమనించి నిందితులను పట్టుకొని నీల్వాయి పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేశాడని అలాగే నీల్వాయి గ్రామానికి చెందిన అశోక్ తన మక్కలు కూడా దొంగతనం జరిగిందని కేసు నమోదు చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి ఆటో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు పగటి పూట కానీ రాత్రి సమయంలో ఎవరైనా కనబడితే 100 కు ఫోన్ చేయాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News