నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటు దొడ్డి మండల పరిధిలోని కొండాపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు టీచర్లుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నతమైన పోస్టుల్లో పాత్ర పోషించారు అనంతరం 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయ పాత్రలతో పిల్లలకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. ఈ చిన్న వయసులో ఉపాధ్యాయ పాత్రలు పోషించడం చాలా అభినందనీయ విషయం చాలా సంతోషంగా ఉంది అని కొనియాడారు. అదేవిధంగా ఈ పాత్రలో మిమ్మలను చూస్తుంటే రాబోయే తరంలో తప్పకుండా గా ఆ పోస్టును నిజ జీవితంలో నెరవేర్చుకోవాలని కొనియాడారు ఆ స్థాయిలో ఉండాలంటే ఇప్పటినుంచి చదువు ను విడిచిపెట్టకుండా గా ముందుకు సాగి చదవాలని పిల్లలకు సూచన చేశారు అనంతరం ఉపాధ్యాయుల బృందం కలిసి కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి కి వెంకటేశ్వరరావు కు శాలువాతో సత్కరించారు అనంతరం పిల్లలతో ఫొటోస్ దిగి పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



