Monday, March 30, 2026

తాగునీటి సమస్యను పరిష్కరించాలి సిపిఐ

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి యండపల్లి గ్రామ పరిధిలోని పెద్దకాలువపల్లె తీవ్రమైన తాగునీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దకాలువపల్లె లో ఉన్న స్కీమ్ బోర్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామాలకు పల్లెలకు తగిని అందిస్తున్నామని హంగు ఆర్భాటంగా ప్రచారం చేశారే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు అన్నారు. ఎందుకు నిదర్శనం అనేక గ్రామాలలో మార్చి మాసంలోనే తీవ్రమైన తాగునీటి ఎద్దటి ఏర్పడింది ఇందుకు కారణం గత పాలకుల నిర్లక్ష్యం తాగునీటి సమస్య ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ఉన్న స్కీం బోరులో నీళ్లు ఉన్నప్పటికీ కొంత మంది మాత్రమే వాడుకోవడంతో మిగిలిన చాలామంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఉన్న బోరులో కనీసం ఐదు పైపులు వేస్తే అందరికీ సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ మరమ్మత్తులు చేయకుండా పంచాయతీ అధికారులు మాత్రం tank ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News