Monday, March 30, 2026

పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణ పై కళాశాల విద్యార్థినీలకు అవగాహన కలిగించిన పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణ గురించి మహిళ సాధికారత వారోత్సవాల్లో భాగంగా పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా విద్యార్థులకు పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా సాధికారత వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థినులకు పోలీస్ స్టేషన్‌లోని విభిన్న విభాగాల గురించి తెలిపారు. మహిళా భద్రత, అత్యవసర వ్యవస్థ, భద్రతా యాప్‌ల ఉపయోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.పోలీసులు తమ విధుల్లో ఉపయోగించే ఆధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు,సెఫ్టీ గాడ్జెట్‌లు, మిషనరీ సామగ్రి గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్ప్‌లైన్ నంబర్లు, స్వీయరక్షణ పద్ధతులపై మెలుకువలు తెలియజేశారు. అనంతరం విద్యార్థినులకు నైతిక విలువలు, ధైర్యసాహసాలు, లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News