- ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 33 స్వయం సహాయక సంఘాలకు 710మంది సభ్యులకు పావలా వడ్డీ ద్వారా సుమారు 4 కోట్ల 35 లక్షల 91 వేల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- స్వయం సహాయకసంఘ సభ్యులకు చెక్కును అందించిన చంద్రగిరి ఎమ్మెల్యే
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : యర్రావారిపాలెం యర్రావారిపాలెం మండలంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు, మహిళలు కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు . అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ …. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరం అక్టోబర్ 2వ తేది మహిళలకు స్వయం సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని అలాగే ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి చెందుతుందని మహిళలు ఆర్థికంగా,విద్య, వైద్యం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ముందు ఉండాలనే ద్రుడ సంకల్పంతో మహిళలకు భరోసా కల్పించిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడుని కొనియాడారు . ప్రతి పురుషుడు కి వెన్నుముక లాంటి వారు మహిళలని స్త్రీ లేనిదే లోకం లేదన్నారు. ఈ శుభదినం సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాలెం మండలంకు 43 స్వయం సహాయక సంఘాలకు గాను గౌరవ ముఖ్యమంత్రివర్యులు 4 కోట్ల 35 లక్షల 91 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలు స్వయం ఉపాధి ద్వారా అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు నిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు మరెన్నో గొప్ప అవకాశాలను ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి ప్రభుత్వం నాయకులు, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



