నేటి సాక్షి, రాయికల్ : మహిళ స్త్రీశక్తి స్వరూపిణీ అని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రగతి హై స్కూల్ ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్ అన్నారు. ప్రగతి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతీ రోజు మహిళలు వారి అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని అన్నారు. మహిళలు తలుచుకుంటే కానిదేది లేదని, ప్రతీ మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలన్నారు.ప్రతీ మహిళ విజయం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి శాయశక్తుల కృషి చేయాలన్నారు.ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నోరంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.కేక్ కట్ చేసి మహిళ ఉపాధ్యాయిని బృందానికి, విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



