Monday, March 30, 2026

రామాపురం మండలం లో మంగతాయి జూదం ఆడుతూ నలుగురు అరెస్ట్

నేటి సాక్షి రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లి సిఐ టీవీ. కొండారెడ్డి గారి సూచనల మేరకు రామాపురం ఎస్సై పీవీ సుధాకర్ రెడ్డి అయిన నాకు ఈ దినం రాబడిన సమాచారం మేరకు రామాపురం మండలం, చిట్లూరు గ్రామం పాలన్నగారి పల్లి దక్షణము వైపు గల కంప చెట్ల కింద (1) నందులూరు అంజినేయ రెడ్డి, 45 సం, పాపిరెడ్డి, పాలన్నగారిపల్లి, చిట్లూర్ గ్రామము, అన్నమయ్య జిల్లా కాల్, 7975584266 (2) మువ్వ చిన్మయా నంద @ లల్లూ యాదవ్, 31 సం, సుబ్రమణ్యం, ఆయిల్ రోటరీ వీది, లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా ఇంకా ముగ్గరు వ్యక్తులు మంగతాయి అను జూదమును అడుతుండగా వారి చుట్టుముట్టి పట్టుకోగా వారిలో ముగ్గరు వ్యక్తులు పారిపోగ ఇద్దరినీ పట్టుకొని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20,700/- రూపాయల డబ్బులు, ఒక కారు రెండు మోటార్ సైకిల్ లు మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేయడమైనది. రామాపురం మండలం నందు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు గురించి తెలిసిన యెడల లక్కిరెడ్డిపల్లి సిఐ గారికి 9121100554 రామాపురం ఎస్ఐ గారికి 9121100558 ఫోన్ ద్వారా తెలుపగలరు. రామాపురం మండలం నందు ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు జరిగిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకొనబడును.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News