- మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించిన జన్ను అరుణ పరంజ్యోతి
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఒయాసిస్ విద్యా సంస్థల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో మార్పు తీసుకు రావాలని ఒయాసిస్ విద్యాసంస్థల ట్రెజరర్ జన్ను అరుణ పరంజ్యోతి అన్నారు. నగరం లోని దేశాయిపేట రోడ్ లో గల ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ లో మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ పరంజ్యోతి మాట్లాడుతూ స్త్రీ అమ్మగా అమృతాన్ని పంచుతుంది, సహోదరిగా అభిమానాన్ని, భార్యగా అనురాగాన్ని, అత్తగా ఆలోచనలను, కూతురుగా ఆనందాన్ని, కోడలుగా ఆదరణ పంచు తుందని తెలిపారు. అర్థం చేసుకునే ఓర్పు అంతులేని సహనం, సాధించగలిగే మనోబలం గుండెల్లో దాచుకునే ఔదార్యం స్త్రీలోని సౌందర్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.



