- తెల్లవారితే పెళ్లి
- కానీ..ఎందుకో.? ఉత్తి పుణ్యానికే ఉరేసుకున్నడు
- పెళ్లింట విషాదం
నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య ) : తెల్లావారితే ఆ యువకుడిది పెళ్లి, కానీ ఎందుకో ఉత్తి పుణ్యానికే ఉరేసుకుని ఊపిరి తీసుకున్నడు. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందనుకుంటే అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. కంటనీరు తెప్పించే ఈ విషాదం నింపిన వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం లోని రామచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కంపల్లి కిరణ్ (38) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం అతని వివాహం ఉండగా శుక్రవారం రోజు వరకు పెళ్లి పనులను ముగించుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు. కార్యక్రమాలు పూర్తిచేసుకుని శుక్రవారం సాయంత్రం ఎప్పటిలానే ఇంటికి వచ్చి తిన్న తర్వాత కాసేపు ఇంటిల్లిపాదీ అర్థరాత్రి వరకు ముచ్చటించి అందరూ పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున చూస్తే అతను ఆత్మహత్యకు చేసుకున్న విషయం తల్లి చూసి బోరున విలపించింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



