- బిజేపీ నాయకులు సాన వేణు

నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని గుండారం గ్రామంలో నీటి ఎద్దడి తట్టుకోలేక మా బావిలు, బోరులు ఎండుతున్నాయని బీజేపీ నాయకులు సాన వేణు తెలిపారు.దాని వల్ల మా పంట పొలాల ఎండుతున్నాయని మా ఊరి దగ్గరలో అటు అన్నపూర్ణ రిజర్వాయర్,ఇటు రంగనాయక సాగర్ ప్రాజెక్టులు ఉన్న కానీ మా పంట పొలాల కి నీరు అందడం లేదని,రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుండి కాలువ ద్వారా చౌడరం గ్రామంలో రైతుల పంటలకు నీరు చేరుతుందని,అక్కడి నుండి మా గ్రామానికీ రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని,వాటిని తొలగిస్తే మా గ్రామ శివారులోని చెక్ డ్యామ్ లోకి నీరు చేరి భూగర్భ జలాలు అడుగంటిపోకుండా అదే విధంగా పంటలు ఎండిపోకుండా ఉంటాయని వెంటనే అధికారులతో మాట్లాడి నీరు వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని గ్రామ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని,అధికారులతో మాట్లాడి మా పంటలు ఎండిపోకుండా మాకు న్యాయం చేయాలని కోరారు. వారి వెంట రైతులు ఎల్కంటి శ్రీనివాస్ రెడ్డి,సూరం తిరుపతి, మరుపాక రమేష్,ఎలుక శ్రీశైలం, గాండ్ల బాలయ్య, గైనీ నర్సయ్య, వాసంపల్లి బాల్ రెడ్డి రైతులు ఉన్నారు.



