Monday, March 30, 2026

బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో బాలల సంరక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో బాలసదనం భవనం నిర్మాణానికి డిసిపి ఎ భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖన్ లతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలల సంరక్షణ దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య నిధులతో నూతన బాల సదనం భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మహిళలు, పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా బాల సదనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బాలలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News