నేటి సాక్షి, సైదాపూర్: సైదాపూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. సైదాపూర్ గ్రామానికి చెందిన ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై ఏ.ఎన్.ఎం గా విధులు నిర్వహిస్తున్న దండవేణి శిరీష, కూతురు విధ్వాన్ రెడ్డి శాలువతో సన్మానించి స్వీట్లు పంచటం జరిగింది. అలాగే సైదాపూర్ గ్రామ పంచాయతీ మహిళ సోదరిమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు. మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సైదాపూర్ సింగల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, గోపాగోని నవీన్, కాసరాజు సురేష్, అనగోని శ్రీనివాస్, నిర్ల వెంకట్రాజ్యం, దాసరి కనకయ్య, గాదేపాక కుమార్ రాజా, వేముల సురేష్, గుల్ల అశోక్, బోళ్ల మహేందర్, బోనగిరి అనిల్ పాల్గొన్నారు.



