Monday, March 30, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

  • డాక్టర్. ఎన్ రమేష్
  • హాస్పటల్ మహిళ సిబ్బంది తో కేక్ కటింగ్

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్లో గల ఎన్ రమేష్ హాస్పిటల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్. ఎన్. రమేష్ హాస్పిటల్ సిబ్బందితో పాటు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళ, ఆమె శక్తియుక్తులు అపారం, ఆమె ఓ ప్రేరణ, ఓ లాలన, స్త్రీ లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి జీవం, జీవితమే లేదు.. స్త్రీ లేకుంటే అంతా శూన్యం అని అన్నారు. అందుకే స్త్రీలకు శతకోటి వందనాలు తెలిపారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా.. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ, ముందంజలో దూసుకుపో తున్న స్త్రీ మూర్తులెందరో. వంట గదికే ఆమెను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది. వాకిలి దాటొద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించింది. అణచివేత నుంచి ఆత్మ విశ్వాసం వైపు పయనించింది అని అన్నారు. వంటింటి నుంచి విశ్వానికి ఎదిగింది. ఆమె ప్రస్థానం అంతా ఇంతా కాదు. ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపించిన తెగువ, తెలివి స్త్రీలది అన్నారు. నేడు ఆమె పండుగ. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని డాక్టర్. రమేష్ కొనియాడారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News