Sunday, March 29, 2026

శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన అందరికీ అభినందనలు

  • ఎస్పీ అఖిల్ మహాజన్
  • అఖిల్ మహాజన్ కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పిగా విధులు నిర్వహించిన అఖిల్ మహాజన్ ఐపీఎస్ బదిలీ పై ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ గిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు పరేడ్ (farewell pared)లో ఎస్పీ కి పోలీస్ అధికారులు ,సిబ్బంది పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా శాంతి కోసం రాజీపడకుండా తనతో పాటు అంకితభావంతో సమిష్టిగా కృషి చేసినందుకు పేరు పేరునా హోం గార్డ్ ఆఫీసర్స్ నుండి ఉన్నత అధికారుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఎన్నికల సమయంలో ఎలాంటి చిన్న అవాంఛనియ సంఘటనలు జరగకుండా, గొడవలు లేకుండా ప్రశాంతవాతావరణం లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా విధులు నిర్వహించిన అందరికీ అభినందనలు తెలిపారు.ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు తన వంతు పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించానని అన్నారు. గడిచిన రెండు సంవత్సరాలు జిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారని, పోలీస్ అధికారులు సిబ్బంది రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News