
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యదర్శి బాబు తో పాటు మాజీ వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, జక్కు మోహన్, జక్కుల లక్మి నర్సయ్య తదితరులు పాల్గొని మాజీ సర్పంచ్ అల్లూరి మనసా తో పాటు మహిళలను శాలువలతో సత్కరించి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళలు ఒకవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు.



