Monday, March 30, 2026

పోలీస్టేషన్లకు అధునాతన కంప్యూటర్లను అందజేత

  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మారుతున్న కాలానుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధునాతన కంప్యూటర్లు అవసరమని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు.శాంతిభతులను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాల అన్ని విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కాబట్టి జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధితమైన విషయాలు భద్ర పరచడానికి సులభంగా తెలుసుకోవడానికి సంబంధిత విషయాలను డటాను పై అధికారులకు తెలియపర చడానికి సోమవారం రోజు జిల్లా పోలీసుకార్యాలయంలో కంప్యూటర్లు,ప్రింటర్లు వివిధ అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను జిల్లాలో అన్ని పోలీస్టేషన్ల పోలీసు అధికారులకు ఎస్పీ అందజేశారు.జిల్లా పోలీసుశాఖలో హోంగార్డు నుండి ఆ పైస్థాయి అధికారులు వరకు ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగులు ఉండటం వలన ఇలాంటి అనునాతన పరికరాలు, ఉపకరణాలు అందజేయడం పట్ల ఉద్యోగులు వీటి సహకారంతో ఎస్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే చేస్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డి ఎస్పీ ఇన్చార్జ్ అదనపు ఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శివకుమార్, జిల్లా కార్యాలయం స్టోర్ సిబ్బంది, సుదర్శన్, భరత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News