నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేను ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అందర్నీ చల్లంగా చూడు స్వామి అంటూ స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వారి వెంట ఫోటోకాల్ ఏఈఓ జి అశోక్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ లు ఉన్నారు.



