Monday, March 30, 2026

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

  • అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు చాత రాజు రాజన్న

నేటి సాక్షి, లక్షెట్టిపేట, ( బైరం లింగన్న ) : సావిత్రిబాయి పూలే ఆశయాలను నిరంతరం కొనసాగించాలని అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు చాతరాజు రాజన్న పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని మోదెలలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటి సారి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చదువు నేర్పిన మహిళా ఉపాధ్యాయురాల ని అన్నారు.అంతకుముందు పట్టణ అధ్యక్షులు తొగరు రాజు, మోదె ల అధ్యక్షులు సామ నపల్లి దుర్గాంజ నేయులుతో కలిసి మాట్లాడుతూ.. ఆనాటి సమాజంలో అక్షరాలు నేర్చుకోవడమే నిశిద్ద మని, అలాంటి సమాజంలో ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని, వితంతువులను ఆదుకోవాలని, వివక్షత లేని సమాజం కోసం కలలు కన్నా మహ నీయు రాలన్నారు. ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భైరం లింగన్న, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, ఉపాధ్యక్షులు లింగంపల్లి సుధాకర్, కండె మొగిలి, మంచాల కుమార్, మోదెల కార్యదర్శి మామిడి ప్రదీప్, చాతరాజు శివ కుమార్, చాతరాజు రాజేష్, లింగంపల్లి శ్రీకర్, చాతరాజు సంతోష్, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News