Monday, March 30, 2026

12న జరిగే ‘యువత పోరు’ను విజయవంతం చేయండి

  • చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : పేద విద్యార్థుల ఫీజులకై పోరాడుదాం.. బాధితులకు భాసటగా నిలుద్ధాం.. జగనన్న ఆదేశాలను పార్టీలోని నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని 12న జరిగే యువతపోరును విజయవంతం చేయాలని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం యువత పోరుకు సంబంధించిన పోస్టర్లను తుమ్మలగుంటలో ఆవిష్కరించారు. చంద్రగిరి నియోజక వర్గంలోని ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వెంట బెట్టుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలిరావాలని కోరారు. కూటమి ప్రభుత్వం వల్ల ఫీజు రీయంబర్స్ మెంట్ ఆగిపోయి ఇబ్బందులు పడ్డ బాధిత కుటుంబాలు యువత పోరులో పాల్గొనేందుకు కలెక్టర్ కార్యాలయం వద్దకు స్వచ్ఛందంగా తరలి రావాలని మనవి చేశారు. ప్రభుత్వంలో కదలిక రావాలంటే మనమంతా ఏకమై పోరాడక తప్పదని, పోరాడటం తప్ప వేరే మార్గం లేదన్న నిజాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలియజేశారు. పేద విద్యార్థుల ఫీజు బకాయిల కోసం చేస్తున్న యువత పోరును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News