- ఈ నెలాఖరు వరకే 25 శాతం రాయితీతో గడువు
- వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారాదా, పి. ప్రావీణ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాన్ని లే..అవుట్, నాన్ లే..అవుట్ యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారాదా, పి. ప్రావీణ్య లు అన్నారు. సోమవారం హనుమకొండ లోని కుడా కార్యాలయంలో జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్ పై లే..అవుట్ డెవలపర్లు, సర్వేయర్లు, యజమానులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులు రెగ్యులరైజ్ చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కచ్చా లేఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్ లు తీసుకున్న ఎల్ఆర్ఎస్ కు వచ్చిన దరఖాస్తు దారులు క్రమ బద్దీకరించుకొనేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
రెగ్యులరైజ్ చేసుకోవడానికి 25 శాతం రాయితితో ఈ నెలాఖరు (మార్చి 31) వరకే ప్రభుత్వం గడువు కల్పించిందని అన్నారు. గడువు పొడగింపు ఉండదని, కల్పిస్తున్న రాయితీ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లే అవుట్ లు చేసిన వారు, ఓనర్లు, రైటర్ లు, బిల్డరు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సమాచారం అవగాహన కల్పించి సకాలంలో ఎల్.ఆర్.ఎస్. చేయించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన లేకపోవడం లేదా సమాచారం లేకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోకుంటే రేపటి రోజున ఎప్పుడైనా ఎల్.ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటు పై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.
నిషేధిత స్థలం లేదా చెరువు, కుంట కింద లేకుంటే ప్లాట్ల యజమాని ఫోన్ కు నేరుగా ఎంత డబ్బులు కట్టాలో సమాచారం వెళుతుందన్నారు. ఏదేని కారణం చేత ఎల్.ఆర్.ఎస్. తిరస్కరణకు గురి అయితే చెల్లించిన డబ్బుల నుంచి 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు కింద మినహాయించు కొని మిగిలిన 90 శాతం డబ్బులు తిరిగి ప్లాటు యజమాని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వివరించారు. ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని, ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్. ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు.
అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్డర్లు, లే అవుట్ ప్లానర్ ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ చేసుకోవడంపై డెవలపర్లు, ప్లాట్ల యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్లు, కమిషనర్ నివృతి చేశారు. ఈ సమావేశంలో కుడా పిఓ అజిత్ రెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి, సంబంధిత శాఖల అధికారులతో పాటు లేఅవుట్, నాన్ లేఅవుట్ యజమానులు డెవలపర్లు, టౌన్ ప్లానర్ లు, లే అవుట్ రైటర్ లు, బిల్డర్లు, సర్వేయర్లు తదితరులు
పాల్గొన్నారు.



