Monday, March 30, 2026

గౌడ సంఘం మండల స్థాయి ఎన్నికలు ఏకగ్రీవం

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రపురం మండలం గౌడ సంఘం ఎన్నికలు ఆదివారం రాయలచెరువు గ్రామంలో గౌడ సంఘం జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు బాబు గౌడ్ అధ్యక్షతన జరిగాయి. ఈ ఎన్నికలలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. గౌడ సంఘం మండల అధ్యక్షులుగా రాచపల్లి దేవరాజుల గౌడ్ ఉపాధ్యక్షులుగా అరగొండ నరసింహులు గౌడ్ జడపల్లి మాతయ్య కోశాధికారిగా మాదాసి మురగయ్య తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ తుమ్మల చంగయ్య రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మాదాసు హేమలత మురగయ్య గౌడ, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిరంజీవి గౌడ్ జిల్లా గౌడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దిండి పాటి కుమారస్వామి గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు గాలేటి చిరంజీవి గౌడ్ జిల్లా యువత అధ్యక్షులు నడవాటి మల్లికార్జున గౌడ్, తిరుపతి సిటీ అధ్యక్షులు తిరకాల మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News