- టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నారీ శక్తి పురస్కారాలు
నేటి సాక్షి, మందమర్రి:- సమాజాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం, పట్టణ శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఎం రమేష్ లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సంస్థ నిర్వాహకుడు సునార్కర్ రాంబాబు నేతకాని అధ్యక్షతన వల్లభాపూరపు సూర్యనారాయణ, పున్నమ్మ ల జ్ఞాపకార్ధం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు నారీశక్తి పురస్కారాలు అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, ముందుగా పున్నమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలకు వైద్యురాలు డాక్టర్ సి మానస, పల్లె దవాఖానా వైద్యాధికారి డాక్టర్ పి భవాని, మహిళా కానిస్టేబుల్ పి సౌజన్య, ఎం అశ్విత, బ్యూటీ ట్రైనర్ గడ్డం మానస, కూచిపూడి నృత్య గురువు గట్టు శ్రావణి, వ్యాపారవేత్త బత్తుల సుజాత, పిఈటి శివాని తదితరుల మహిళలకు నారిశక్తి పురస్కారాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. సమాజ కట్టుబాట్లు వల్ల గతంలో వంటింటికే పరిమితం కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు వారిలో చైతన్య నింపారని తెలిపారు. మొట్టమొదటి మహిళా వైద్యురాలైన విశేష సేవాలందించిన డాక్టర్ ఆనందీభాయ్ జోషి, అంతరిక్ష ప్రయాణం చేసిన కల్పనా చావ్లా, తొలి మహిళ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ తదితరాలు మహిళ లోకానికి ఆదర్శప్రాయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల సతీష్, రామిరెడ్డి, అసిస్టెంట్ మాస్టర్ సాయి లు పాల్గొన్నారు.



