- బి. దత్తు నాయక్ సిపిఐ మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ లో 10.03.2025 సిపిఐ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్యూనిస్టు పార్టీ చారిత్రక నేపథ్యాన్ని పోరాటాల చరిత్రను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజా వ్యతిరేక విధానాలను చర్చించడానికి మార్చి 11న జరిగే సెమినార్ ర్యాలీలలో అత్యధిక భారీ సంఖ్యలో ప్రజలు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని బి.దత్తు నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ హర గోపాల్, పాశం యాదగిరి హాజరవుతారని తెలియజేశారు. ఈ సెమినార్, ర్యాలీలో వేలాది సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సిపిఐ కందుకూరు మండల కార్యదర్శి రాజు, దేవేంద్ర గౌడ్, ఎన్ యాదగిరి, బ్రహ్మచారి రమేష్ యాదయ్య అర్జున్ తదితరులు పాల్గొన్నారు.



