- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- వివిధ సమస్యలపై మొత్తం 153 దరఖాస్తుల స్వీకరణ


నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో పెట్టవద్దని స్పష్టం చేశారు. మొత్తం 153 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 62, సిరిసిల్ల మున్సిపల్ 22, సెస్ 3,ఉపాధి కల్పన శాఖకు 11, మైన్స్ 5, జిల్లా వైద్యాధికారి 3, వ్యవసాయ శాఖకు 2, ఎల్ డీ ఎం 1, ఈఓ వేములవాడ 1, జిల్లా పౌర సరఫరాల అధికారి 2, జిల్లా సంక్షేమ అధికారి కి 8, డీపీఆర్ఈ 2, ఎస్డిసీ 3, విద్యా శాఖకు 5, ఎంపీడీవో గంభీ రావు పేటకు 3, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తికి 2,, ఎస్ సీ కార్పొరేషన్ కు 3, మున్సిపల్ కమిషనర్ వేములవాడ 2, ఎంపీడీవో వేములవాడ రూరల్, బోయినపల్లి, తంగల్ల పల్లి, ముస్తాబాద్ కు 1, ఎస్పీ ఆఫీస్, సీ పీ ఓ, హాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, నీటి పారుదల శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రజావాణిలో సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధా భాయ్, డీఆర్డీ ఓ శేషాద్రి, వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



