- ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించిన
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గంలోని ఈరోజు ఉదయం కె.టి.దొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన కూలీలు జీవన ఉపాధికై ధర్మవరం కు వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు గద్వాల మండలం జమ్మిచేడు దగ్గర బొలెరో మరియు ట్రాక్టర్ ఢీకొని ప్రమాదం చోటు చేసుకుని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించగా మరికొంతమందిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమని, ముఖ్యంగా పరిమితికి మించి వాహనాల్లో ఎక్కువ మందిని తరలించారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ముఖ్యంగా పోలీసుశాఖ దీనిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గౌని శ్రీనివాస్ యాదవ్, లవన్న, విష్ణు, జమ్మన్న, కె.పి. రామకృష్ణ, వెంకటేష్,బట్టు రంగస్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



