నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 34 వ వార్డుకు చెందిన తాటికొండ సుజాత ఇటీవల మరణించగా సోమవారం 34వ వార్డు మాజీ కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ లు తాటికొండ సుజాత కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని వార్డ్ పెద్ద మనుషుల చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్ లు కాలం చేసిన తాటికొండ సుజాత మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాటికొండ సుజాత భౌతికంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.



