- సన్మానించి కాంగ్రెస్ నాయకులు
నేటి సాక్షి, మందమర్రి:- బాడీ బిల్డింగ్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన పట్టణానికి చెందిన అక్షయ్ ని సోమవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అక్షయ్ ని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకుడు మంద తిరుమల్ రెడ్డి, యువజన నాయకులు రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్ యాదవ్ లు మాట్లాడుతూ, జిల్లాలోని నస్పూర్ లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలలో సుమారు 100 మంది పైగా క్రీడాకారులు జిల్లా నుంచి పాల్గొనగా, పట్టణానికి చెందిన అక్షయ్ 70 కిలోల విభాగంలో మొదటి బహుమతి సాధించాడని తెలిపారు. అక్షయ్ ఇదేవిధంగా మరిన్ని విజయాలు సాధిస్తూ, ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సురేందర్, అన్వేష్, పసునూరి రాము, మణిదీప్, చింటూ, ఆంజనేయులు లు పాల్గొన్నారు.



