Monday, March 30, 2026

అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ,పెన్నులు పంపిణీ

నేటి సాక్షి వీణవంక:
వీణవంక మండలం, బొంతుపల్లి గ్రామానికి చెందిన జున్నూతుల కౌసల్య స్మారకార్థం 5 వ వర్దంతిని పురస్కరించుకొని జున్నూతుల నారాయణరెడ్డి, వారి కుమారుడు జున్నూతుల రాఘవరెడ్డి (SPGO) ప్రధానమంత్రి సురక్ష అధికారి, మామిడాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో వీణవంక మండల విద్యాధికారి శోభారాణి చేతుల మీదుగా పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ నారాయణరెడ్డి, PMSPG ప్రధానమంత్రి ముఖ్య భద్రత అధికారి రాఘవరెడ్డి, మరియు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి అభినందనలు తెలుపుతూ విద్యార్థిని, విద్యార్థులు టీవీలకు,సెల్ ఫోన్ లకు ఆకర్షితులు కాకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని తెలియజేసి అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్ధసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న ముదిరాజ్ ,ముఖ్య సలహాదారుడు అంకతి వేణు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మహేశ్వర శర్మ, సంగీత వేణుగోపాల్ ,వనజ,శ్యామల, సరోజన రమ మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News