నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… శ్రీరాజరాజేశ్వర స్వామి కరుణ కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు అందించి ఆలయ అభివృద్ధితోపాటు ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు శక్తినివ్వాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.



