- ఏడాది పాటు రజితోత్సవ వేడుకలు
- 27వ తేదీన బిఆర్ ఎస్ పార్టీ భారీ సభ
- లక్షల మందితో కని విని ఎరుగని రీతిలో సభ
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ హరిత హోటల్ లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతి పక్ష నేత మధుసూదన్ చారి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, శంకర్ నాయక్ లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ 25 వ సంవత్సరం లోకి అడుగెడుతున్న సందర్భంగా రజితోత్సవ సభ ను ఘనంగా నిర్వహించేందుకు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని తెలిపారు. తన సలహా మేరకు సభను నిర్వహించేందుకు గతంలో 15 లక్షల మంది తో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బిఆర్ పార్టీ దని, ఉద్యమాల ఖిల్లా వరంగల్ లో అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే సభకు రెండు చోట్ల స్థలాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనను నిదర్శనంగా రజోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని అన్నారు. సామాజిక, చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక తెలంగాణ సాధించడం జరిగిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడమే బిఆర్ పార్టీ లక్ష్యమని, తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. పదేళ్ల కె సి ఆర్ పాలనలో ప్రారంభించిన రైతు బంధు పథకం పి. ఏం కిసాన్ గా, మిషన్ భగీరథ పథకాన్ని హార్ధర్కోజల్ అని, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో అద్భుతమైన ప్రగతిని అందించడం జరిగిందన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతులకు సాగునీరు అందించడం ద్వారా దేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి అని అన్నారు. ఫర్ క్యాపిటల్ యూనికంలో దేశానికి మార్గదర్శిగా నిలిచిందని, టిఆర్ఎస్ ప్రభుత్వ హాయామంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను ఎన్నింటినో అమలు చేశామని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదని ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ ది అని అన్నారు.11 వేల కోట్ల రూపాయలతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చామని, ఇవేగాక కేసిఆర్ కిట్టు, బ్యూటిషన్ కిట్టు సంచార పశు వైద్యశాలలతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టామని అన్నారు. రైతుల కోసం రైతు బంధు, భీమా, తదితరులు పథకాలతో పాటు పల్లెలో చెరువు నింపి రైతుల పంటలకు సకాలంలో పంట దిగుమతి అందించేందుకు సహకరించిందన్నారు.ప్రజలంతా కేసిఆర్ ను చూడాలని, తన మాట వినాలని కోరుకుంటున్నారని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ సభ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు పని చేసేది ఎవరో, చెయ్యని వారు ఎవరో, పాలు ఏందో, నీళ్లు ఏందో, గట్టోడు ఎవరో, వట్టోడు ఎవరో ప్రజలకు తెలుసునని వారు గమనిస్తూ ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుక బి ఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ లో ప్రసవించిన బిడ్డ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. గోదావరి, కృష్ణ జలాలను ఆంధ్రకు తీసుకు పోతుంటే అధికారంలో ఉన్న, లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన పార్టీ బి ఆర్ ఎస్ అని, ఖమ్మం నల్లగొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండి పోతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది బిఆర్ ఎస్ అని అన్నారు. రజితోత్సవ సభ కోసం చాలా మంచి ఎక్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూడవలసిన అవసరం ఉందని అన్నారు. మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా పరిశీలించి మరొకసారి కూడా వచ్చి ఫైనల్ చేస్తామని, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం వరంగల్ లోనే ఉండి, మీడియాతో కూడా ఇంకా డీటెయిల్స్ లో మాట్లాడుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నా పొడవు గురించి మాట్లాడారని, పొడవుగా ఉండడం నాకు దేవుడిచ్చిన వరమని, నేను వారి లాగా విమర్శించవచ్చు కానీ విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా ఉన్నానని అన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సబబు కాదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే నరేందర్ రెడ్డి ఓటమికి కారణ మయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అమ్ముడు పోయే చరిత్ర నీకు ఉంది అని, పాలన మీద దృష్టి పెట్టాలని, మొన్నటి ఎన్నికల్లో బడే బాయికి చోటే బాయ్ ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్పొరేటర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.



