- ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం క్రింద 25 శాతం పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి, అధిక ఫీజులు అరికట్టాలి
- ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చిట్టీ దందాలు, అక్రమ వ్యాపారాలు చేసే వారి మీద చర్యలు తీసుకోవాలి
- జిల్లా కలెక్టర్ సంతోష్ కి వినతిపత్రం అందజేసిన
- ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాచర్ల ప్రకాష్
- పేదలకు 25 శాతం ఉచిత సీట్లు అమలు చేస్తాననీ హామీ ఇచ్చిన కలెక్టర్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జిల్లా కలెక్టర్ సంతోష్ తో మాచర్ల ప్రకాష్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో విద్యలో, అభివృద్ధిలో వెనకబడిపోయిన మా జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలనీ, జిల్లా అక్షరాస్యత 49 శాతం నుండి 100 శాతానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలనీ, డ్రాపౌట్స్ అరికట్టాలని, నాణ్యమైన విద్య పేద పిల్లలకు అందే విధంగా చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విద్యార్థుల మీద దృష్టి పెట్టకుండా సిసిఎస్ నియమాలు అతిక్రమిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అక్రమ చిట్టి దందాలు, వడ్డీ వ్యాపారాలు పెట్రోల్ బంకులు, వివిధ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని అలాంటి వారి మీదా చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా విద్య హక్కు చట్టం 2009, సెక్షన్ 12 ప్రకారంగా ప్రైవేటు పాఠశాలలో పేద పిల్లలకు 25% ఉచితంగా సీట్లు వచ్చే అకాడమీక్ ఇయర్ నుండి ఫ్రీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మాచర్ల ప్రకాష్ వినతి పత్రం అందచేశారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ 25% ఉచితంగా సీట్లు ప్రైవేటు పాఠశాలలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.



