Tuesday, March 31, 2026

ఆవేదన వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ టీచర్

  • కన్న కొడుకులు ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు

నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : రిటైర్మెంట్ అయ్యాక కన్న కొడుకులతో ఆనందంగా కాలక్షేపం చేస్తా అనుకున్న తండ్రి ఆశలు అడి ఆశలవుతున్నాయి. ఇది కన్న కొడుకులు పెట్టే ఇబ్బందుల వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒక విశ్రాంతి ఉపాధ్యాయుడి కన్నీటి గాధ 16 ఎకరాలు భూమి పంచి ఇచ్చిన, పింఛన్ డబ్బుల కోసం కన్న కొడుకులు కాదనడంతో ప్రజావాణిలో కలెక్టర్కుమొరపెట్టుకున్నడు ఈ తండ్రి నాకు న్యాయం చేయమని విన్నవించుకున్న గాధ పలువురిని ఆలోచింప చేయగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణకు ఈ కష్టం వచ్చింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం పిల్లల నారాయణకు నలుగురు కొడుకులు, నలుగురు బిడ్డలు, నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఉద్యోగులు కాగా ఒకరు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నారు. కొద్ది సంవత్సరాల క్రితమే విశ్రాంత ఉద్యోగి నారాయణ కన్న కొడుకులకు 16 ఎకరాల భూమిని పంపిణీ చేశాడు. తర్వాత తన వద్ద రెండు ఎకరాల భూమి ఉంచుకొని రెండో కొడుకు వెంకటేశ్వర్లు వద్ద కాలం గడుపుతున్నాడు. అయితే కొద్ది కాలంగా పింఛన్ డబ్బుల విషయంలో కన్నకొడుకులు ఇబ్బందులు పెట్టడంతో వృద్ధుడైన పిల్లల నారాయణ అనేక ఇబ్బందులు పడుతున్నాడు. వారి ఇబ్బందులు తట్టుకోలేక సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు తమ గోడు చెప్పుకుంటూ న్యాయం చేయాలని వేడుకున్నాడు. అంతేకాకుండా అతనికి చెందిన మిగతా రెండు ఎకరాల భూమిని ఎవరికైనా దానధర్మం చేస్తాను గానీ కొడుకులకు పంచి ఇవ్వనని, వాళ్లకు అధికారం లేకుండా చేస్తానని బాధపడ్డాడు. కాగా ఈ సంఘటన స్థానికులను కలచివేయగా, విద్య వంతులైన ఇంట్లో ఇలాంటి సమస్య రావడం బాధాకరమని పలువురు పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News