Monday, March 30, 2026

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి

  • సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి కలెక్టరేట్ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం మద్యాహ్నం స్థానిక కల్లెక్టర్ చాంబర్ నందు ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు. చిన్నగొట్టిగళ్ళు మండలం, టి. కుమ్మరపల్లి గ్రామానికి చెందిన ఎ. చిన్న రెడ్డెప్ప, వయస్సు 34 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని, రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు ముఖ్యమంత్రి గారికిని కలువగా సిఎం గారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ గారు అందజేశారు. తిరుపతి పట్టానికి చెందిన ఎం. చంద్రశేఖర్ వయస్సు వయస్సు 45 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని, ఆ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకున్నానని, ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1.60 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు. రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామానికి చెందిన ఎం. స్వర్ణలత వయస్సు 45 సంవత్సరాలు, గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ రెండు లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద కలెక్టర్ గారు అందజేశారు. కార్వేటి నగరానికి చెందిన వ్యక్తి పాపమ్మ తన కొడుకు ప్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడని, కుటుంబం పోషణ భారంగా ఉందని, ముఖ్యమంత్రిని ఆర్ధిక సహాయం కోరిన నేపథ్యంలో వారికి మూడు లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద జిల్లా కలెక్టర్ అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News